గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (19:06 IST)

రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు రూ.1221 కోట్లు

cash
ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.948.35 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్రం. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అభివృధ్ది కోసం నిధులను విడుదల చేసినట్టు కేంద్ర సర్కార్‌ పేర్కొంది.
 
భారత్‌లోని అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.15,705.65 కోట్లు రిలీజ్‌ చేసింది. ఇందులో బీహార్‌కు రూ.1,921 కోట్లు, తమిళనాడుకు రూ. 1,380.50 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు విడుదల చేసింది.