1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (10:01 IST)

కాల్పుల మోతతో దద్ధరిల్లిన అగ్రరాజ్యం... 9 మంది మృత్యువాత

gun shot
అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాల్పుల మోతతో దద్ధరిల్లింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆలెన్ నంగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ దండుగుకు కనిపించిన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లోని పరిసర ప్రాంతాల్లో శనివారం ఈ దండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఫుట్‌పాత్‌పై నడుస్తూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు నగర పోలీస్ చీఫ్ బ్రయన్ హార్వీ ప్రకటించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన టెక్సాస్ రాష్ట్ర గవర్నర్... ఇది మాటలకు అందని విషాదమని వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులకు, బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
కాగా, అమెరికా ఈ యేడాది ఇప్పటివరకు 198 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. 2016 తర్వాత ఇవే అత్యధిక ఘటనలు కావడం గమనార్హం. 2021లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 49 వేల మంది మరణించగా, 2020లో 45 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరిగాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతున్న విషయం తెల్సిందే.