శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (19:08 IST)

పాకిస్థాన్‌పై అమెరికాకు ఎంత ప్రేమో.. రూ. 6121 కోట్ల సాయం.. రక్షణ బిల్లుకు ఆమోదం..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. భారతదేశానికి ఆందోళన కలిగించే ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ ట్రంప్.. అధ్యక్షుడు కాగానే తన వైఖ

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. భారతదేశానికి ఆందోళన కలిగించే ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ ట్రంప్.. అధ్యక్షుడు కాగానే తన వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. నాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని పేర్కొన్న ట్రంప్‌.. ఇప్పుడు ఏకంగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను అమెరికా మరోసారి బయటపెట్టింది. ఆ దేశానికి వివిధ రూపాల్లో రూ.6121 కోట్ల సాయం అందించాలన్న రక్షణ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకు పాక్ చర్యలు తీసుకుంటుందన్న ఉద్దేశంతోనే ఈ సాయానికి అమెరికా మొగ్గు చూపినట్టు సమాచారం. అమెరికా అందించనున్న సాయానికి అమెరికా నేషనల్ డిఫెన్స్ అథరైజేషన్ యాక్ట్-2017కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం కూడా తెలిపింది.