గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (09:19 IST)

అర్థ గంటలో 10 కోట్ల మంది చనిపోతారు.. శవాల గుట్టలే.. ఉ.కొరియాకు అమెరికా వార్నింగ్

రెచ్చగొట్టే చర్యలతో నిరంతరం ఉద్రిక్తపరిస్థితులు నెలకొనేందుకు కారణంగా నిలుస్తున్న ఉత్తర కొరియాకు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. తొందరపాటు చర్యకు దిగితే ఊహకందని విధ్వంసాన్ని చవిచూస్తారని, ఆ తర్వాత ఉత

రెచ్చగొట్టే చర్యలతో నిరంతరం ఉద్రిక్తపరిస్థితులు నెలకొనేందుకు కారణంగా నిలుస్తున్న ఉత్తర కొరియాకు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. తొందరపాటు చర్యకు దిగితే ఊహకందని విధ్వంసాన్ని చవిచూస్తారని, ఆ తర్వాత ఉత్తర కొరియా గడ్డపై శవాల గుట్టలే మిగులుతాయని అమెరికా హెచ్చరించింది. 
 
గత కొన్ని రోజులుగా అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయంతెల్సిందే. అయినప్పటికీ.. అమెరికా సహనాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఈనేపథ్యంలో దేశ రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాము గనుక యుద్దానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన మాటల్లో తేటతెల్లం చేశారు. 
 
గువాం ద్వీపంపై దాడి చేస్తామంటూ ఊగిపోతున్న ఉత్తరకొరియాకు ఆయన ఝలక్ ఇచ్చారు. అదే గనుక జరిగితే ఎదురుదాడికి తాము వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. తాము గనుక యుద్దానికి దిగితే అది ఒక్క ఉత్తరకొరియాకే నష్టం కాదని, దాని పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.
 
అమెరికా అణుదాడికి ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపించేవని, దాని తీవ్రత ఊహించినంత భయంకరంగా ఉంటుందని తెలిపారు. 30 సెకెన్లకు 30,000 మంది, అరగంటలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొన్నారు. అయితే అలా జరగకూడదని అమెరికా భావిస్తున్నది గనుకే అమెరికా ఓపికతో వ్యవహరిస్తుందని తెలిపారు. అయితే, అణుదాడులు ప్రపంచ వినాశనానికే తప్ప అంతకుమించి వాటితో సాధించేది ఏమి లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.