ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (13:16 IST)

అమెరికా బంగారు నాణెం రికార్డ్.. ఏకంగా వేలంలో రూ.14కోట్లు పలికింది..!

Golden COin
అమెరికా బంగారు నాణెం రికార్డ్ సృష్టించింది. 'డబుల్‌ ఈగల్‌'గా పేరున్న ఈ నాణెం ఏకంగా రూ.14 కోట్లు పలికి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ డబుల్ ఈగల్ కాయిన్‌ను వేలం వేయగా భారీగా ధరకు అమ్ముడుపోయింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టువార్ట్‌ వీట్జమన్‌కు చెందిన ఈ డబుల్ ఈగల్ నాణేన్ని వేలం వేశారు.
 
20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేసినా… తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి యూఎస్ ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్‌ డబుల్‌ ఈగల్‌ నాణేలను చలామణికి విడుదల చేయకుండా నిలిపివేశారు. అనంతరం ఈ నాణాలను కరిగించమని ఆదేశించారు.
 
ఆనాడు బయటికి వచ్చి రెండు నాణాలలో ఈ డబుల్ ఈగల్ నాణెం ఒకటిగా ఉంది. డబుల్‌ ఈగిల్‌ కాయిన్‌పై ఒకవైపు లేడీ లిబర్టీ, మరో వైపు అమెరికన్‌ ఈగిల్‌ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 
 
1794కు చెందిన 'ఫ్లోయింగ్‌ హెయిర్‌' వెండి నాణేం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణేంగా రికార్డులకెక్కగా ఆ రికార్డును డబుల్‌ ఈగిల్‌ కాయిన్ తుడిచిపెట్టేసి రూ.142 కోట్లు పలికి మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.