స్పెక్ట్రమ్ వేలం ముగిసింది.. Rs 57,122 కోట్లతో రిలయన్స్ జియో ముందంజ

reliance jio
reliance jio
సెల్వి| Last Updated: మంగళవారం, 2 మార్చి 2021 (20:35 IST)
ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా రూ.57,122 .65 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. టెలికాం సంస్థలు ప్రతీ ఏడాది వేలం ద్వారా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే సంగతి తెలిసిందే.

ఈ నేఫథ్యంలో టెలికాం సంస్థల మధ్య స్పెక్ట్రమ్ వేలంలో పోటీ వాతావరణం నెలకొంది. ఈ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం టెలికాం సంస్థలన్నీ పోటీపడగా, జియో ఈ వేలంలో ముందజలో నిలిచిందని తెలుస్తోంది. ఈ వేలంలో రూ.77.814 కోట్ల విలువైన ఎయిర్ వేల్స్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు అయినట్లు సమాచారం.

ఇంకా రిలయన్స్ జియో రూ. 57,122.65 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ రూ.1,999.40 కోట్లు విలువ గల స్పెక్ట్రమ్‌ను వేలంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :