గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (18:23 IST)

అర్జున్-హర్భజన్‌ సింగ్ కాంబోలో ఫ్రెండ్‌షిప్.. తెలుగు రైట్స్v..?

FriendShip
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్ కాంబోలో రూపొందుతోన్న క్రేజీ చిత్రం 'ఫ్రెండ్‌ షిప్‌'. రూ.25 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళ్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుకు శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏ.ఎన్. బాలాజీ సొంతం చేసుకున్నారు.
 
'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని "ఫ్రెండ్ షిప్" పేరుతోనే.. 'సింగ్ అండ్ కింగ్' అనే ట్యాగ్ లైన్ జోడించి.. తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు బాలాజీ సన్నాహాలు చేస్తున్నారు. హర్భజన్‌ సింగ్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది. చిత్ర షూటింగ్‌ విషయానికి వస్తే.. చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరగనుంది.
 
ప్రస్తుతం కోయంబత్తూర్, తదుపరి ఊటీలో చివరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాజీ 'మిస్ శ్రీలంక' మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ 'లోస్లియా' హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. 'జి-జాంబి' హీరో ఆర్యన్ గౌడ్, 'రంగస్థలం' మహేష్, అంకిరెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు.