మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (09:39 IST)

భారత అక్రమ వలస టెక్కీల భరతం పట్టండి... సిలికాన్ వ్యాలీకి ట్రంప్ ఆర్డర్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దృష్టి ఇపుడు భారత టెక్కీలపై మళ్లింది. ముఖ్యంగా వరల్డ్ ఐటీ సెంటర్ సిలికాన్ వ్యాలీలో ఉన్న అక్రమ వలసదారుల టెక్కీలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దృష్టి ఇపుడు భారత టెక్కీలపై మళ్లింది. ముఖ్యంగా వరల్డ్ ఐటీ సెంటర్ సిలికాన్ వ్యాలీలో ఉన్న అక్రమ వలసదారుల టెక్కీలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో అక్రమ వలస టెక్కీలకు కంటిమీద కునుకులేకుండా పోయింది.  
 
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులపై ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, జడ్జీలకు అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ నుంచి ఆదేశాలు అందాయి. ఎంత కాలం నుంచి దేశంలో ఉంటున్నారన్న అంశంతో నిమిత్తం లేకుండా అక్రమ వలసదారులందరినీ నిర్బంధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 
 
'అక్రమ వలసదారులను గుర్తించడం.. నిర్బంధించడం.. వెనక్కి తిప్పి పంపడం' అన్న నినాదంతో అధికారులు రంగంలోకి దిగుతున్నారు. అదుపులోకి తీసుకున్న అక్రమ వలసదారులను ఉంచేందుకు తగిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. మున్ముందు అక్రమ వలసదారుల కేసులు పెరిగే అవకాశం ఉండటంతో అదనంగా మరికొందరు జడ్జీలను కూడా నియమించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలనుకొనే వారి ఆటలు ఇకపై చెల్లవని, అమెరికాలో ట్రంప్‌ శకం ప్రారంభమైందని అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ పేర్కొన్నారు.
 
అయితే, అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత వారిని వారి వారి దేశాలకు తిప్పి పంపించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఇది అంత తేలిక కాదన్నది ఇమ్మిగ్రేషన్‌ నిపుణుల అభిప్రాయం. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.