శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (10:08 IST)

కుమార్తెలో ట్రంప్‌కు నచ్చిందేంటో తెలుసా? కామన్ సెక్స్ అట.. ఆమెకు బెస్ట్ బాడీ ఉందట..

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె పట్ల పరమ నీచంగా మాట్లాడిన ఫ్రూఫ్ ఒకటి బయటపడింది. 2013లో తండ్రీ కూతుళ్లు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూల

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె పట్ల పరమ నీచంగా మాట్లాడిన ఫ్రూఫ్ ఒకటి బయటపడింది. 2013లో తండ్రీ కూతుళ్లు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో డొనాల్ట్ ట్రంప్ తన కూతురు ఇవాంకా పట్ల నీచంగా మాట్లాడిన వైనం వెలుగులోకి వచ్చింది. 
 
వెండీ విలియమ్స్ షో అనే ఈ కార్యక్రమంలో.. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి.. మీ తండ్రిలో మీకు నచ్చిన గుణమేమిటని ఇవాంకాను ప్రశ్నించాడు. అందుకు రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ఆటలో మంచి ప్రావీణ్యం చూపుతారు. అదే ఆయనలో తనకు నచ్చిన అంశం అని తెలివిగా సమాధానమిచ్చింది. అయితే మీ కూతురిలో మీకు నచ్చిన విషయం ఏమిటంటే.. ట్రంప్ జంకకుండా కామన్ సెక్స్ అని బదులిచ్చాడు. కానీ ఆమెతో దీన్ని ముడిపెట్టడం లేదని చెప్పుకొచ్చాడు. 
 
2003లోను డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె ఇవాంకా ఆరడుగుల పొడవున్న సుందరి అని ఆమెకు బెస్ట్ బాడీ ఉందని వ్యాఖ్యానించాడు. అలాగే అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్లీ ఒబామాను కూడా ట్రంప్ పరోక్షంగా ప్రశంసించాడు. ఆమెకు తాను సపోర్టర్ అని, ఎంతో అభిమానిస్తానని చెప్పుకొచ్చాడు. ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని చాలామంది మహిళలు ఆరోపించగా..ఓ పోర్న్ స్టార్ సైతం ఆయన తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.