అమెజాన్ పొరపాటుతో ఏం జరిగిందంటే?

మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:28 IST)
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ చేసిన ఓ చిన్న పొరపాటు విద్యార్థులకు వరంగా మారింది. బ్రిటన్‌లోని విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెజాన్ ప్రకటించిన ఓ ఆఫర్.. చిన్న పొరపాటు కారణంగా కోట్లాది రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

యూకేలో చదువుకుంటున్న విద్యార్థులు అమెజాన్ ద్వారా ఏదైనా వస్తువును కొనుగోలు చేసి ‘వెల్‌కమ్5’ అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే వారికి దాదాపు రూ.450 విలువైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతే విలువున్న వస్తువునే కొనుగోలు చేస్తే పైసా ఖర్చు చేయకుండా ఉచితంగా దానిని పొందవచ్చు.

అయితే ఈ కోడ్ కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని అమెజాన్ తెలిపింది. దీంతో అక్కడి విద్యార్థులు మొదటి ట్రాన్సాక్షన్‌ చేసి ఉచితంగా వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు.
 
అయితే, కొందరు విద్యార్థులు రెండోసారి కూడా సరదాగా ఆ కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయడంతో వెబ్‌సైట్ తీసుకుంది. దీంతో మరోసారి అతడు కొనుగోలు చేశాడు. విషయం ఆ నోటా ఈనోటా పాకడంతో యూకే వ్యాప్తంగా విద్యార్థులు చెలరేగిపోయారు. ఒకే ఖాతా నుంచి వందలాది ఆర్డర్లు చేస్తూ నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు.

విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్డర్లు పెడుతూనే ఉన్నారు. వారి దెబ్బకు ఒకానొక దశలో టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో టూత్‌పేస్ట్ ఉందంటే ఎంత మంది ఈ ఆఫర్‌ను వినియోగించుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కాలేజీ సమీపంలో ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న విద్యార్థి ఈ ఆఫర్‌ను ఎంతలా వాడుకున్నాడంటే.. ఆర్డర్ చేసిన వస్తువులు పెట్టుకోడానికి ఫ్లాట్ సరిపోక చాలా వస్తువులను తన ఇంటికి పంపించేశాడు.

ఎన్నో కాలేజీ హాస్టళ్లకు ఉదయం నుంచి రాత్రి వరకు నిమిషం వ్యవధి లేకుండా వస్తువుల డెలివరీలు జరిగాయంటే అమెజాన్ చేసిన పొరపాటును విద్యార్థులు ఎలా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఖాతా నుంచి వందల ఆర్డర్లు వస్తున్నప్పటికీ అమెజాన్ మాత్రం జరిగిన పొరపాటును 10 రోజులు గడిచినా గుర్తించలేకపోయింది.

అక్టోబర్ 15 నుంచి గత గురువారం వరకు ఈ ఆఫర్ ద్వారా కొన్ని లక్షల వస్తువులను విద్యార్థులు ఉచితంగా పొందారు. జరిగిన పొరపాటును ఆలస్యంగా తెలుసుకున్న అమెజాన్ వెంటనే తప్పును సరిచేసుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోట్లాది రూపాయలను నష్టపోయింది.

అమెజాన్ పొరపాటుపై విద్యార్థులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలకు ఇదేమంత పెద్ద నష్టం కాదని.. పైగా ఇలా జరగడం వల్ల కంపెనీ పేరు మారుమోగుతుందని అంటున్నారు. ఈ ఆఫర్ కోడ్ ద్వారా తమ మనసుల్లో అమెజాన్‌ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందంటూ ఉచితంగా వస్తువులను పొందిన విద్యార్థులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments