శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (15:28 IST)

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్న జో-బైడెన్

joe biden
అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. బలహీనపడిన చైనా, యూఎస్ మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. 
 
నవంబరులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని వైట్ హౌస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్ సందర్భంగా కలుసుకున్న తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నాయకుల మధ్య వ్యక్తిగత సమావేశం ఇదే కావడం గమనార్హం.