Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

Written By ఎం
Updated: మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:10 IST)
కాలిఫోర్నియా రాష్ర్టాన్ని కార్చిచ్చు కమ్మేసింది. అసలే పొడి వాతావరణం.. ఆపై భీకరమైన గాలులు తోడవడంతో అడవులతోపాటు ఇళ్లు, ఇతర నిర్మాణాలు పెద్ద మొత్తంలో కాలి బూడిదయ్యాయి. 
 
అరిజోనా, ఫ్లోరిడా, కాలిఫోర్నియాలలో కార్చిచ్చు చెలరేగడం కొత్తేమీ కాదు! కానీ, కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విపత్తుగా నిలిచిపోయే స్థాయిలో ప్రస్తుత కార్చిచ్చు దహించివేస్తోంది. గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 
 
సొనోమా కౌంటీలోని కిన్‌కేడ్‌ అడవిలో బుధవారం అర్ధరాత్రి రాజుకున్న కార్చిచ్చు 54 వేల ఎకరాలకు పైగా విస్తరించి కాలిఫోర్నియా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భూతల మార్గంతోపాటు హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లుతూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించినా మంట లు 5 శాతమే అదుపులోకి వచ్చాయి.
 
గంటకు 164 కిలోమీటర్ల వేగంగా భీకరమైన గాలులు వీస్తుండడంతో మంటలు ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. దీంతో, కిన్‌కేడ్‌, శాంటా రోసా, సొనోమా ప్రాంతాల్లోని 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు. 
 
అలెగ్జాండర్‌ వ్యాలీలో 1869లో స్థాపించిన ‘సోడా రాక్‌’ మద్యం తయారీ కేంద్రం పూర్తిగా బూడిదైంది. శనివారం నుంచి 28 లక్షల మందికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments