శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (12:46 IST)

పోర్న్ వీడియోలతోనే కాలం వెళ్ళదీస్తూ.. నాతో సెక్స్ చేయడం మానేశాడు... అందుకే చంపేశా..!

ఈ దంపతులకి వివాహం అయ్యి దాదాపు 50 ఏళ్లు కావస్తోంది. 15 ఏళ్ల వయసులోనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్ద‌రూ ఏడు ప‌దుల వ‌య‌స్సుకు దగ్గరయ్యారు. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఏంటంటే... ప‌దేళ్ల కాలంలో అత‌డు త‌న భార్య‌తో శృంగారంలో పాల్గొన‌క‌ పోవ‌డంతో పాటు ప‌దే ప‌దే పోర్న్ వీడియోలు చూస్తుండ‌టంతో ఆగ్రహించిన ఆ సతీమణి త‌న భ‌ర్త‌ను కిరాతకంగా చంపేసింది. 
 
వివరాల్లోకి వెళ్లితే... లాంక్ షైర్‌లోని ఓస్వాల్డ్ విజిల్‌లో లిండా హోమ్స్ (70), గోర్డాన్ (78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు ఆమె బయటకు వెళ్లి తిరిగి వచ్చిచూస్తే భర్త ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని మాట దాటేశాడు. భ‌ర్త త‌న‌ను ట‌చ్ చేయ‌క‌ుండా, అశ్లీల చిత్రాలు చూడడంతో  కోపానికి గురైన లిండా ఓ రోజు ఆవేశంలో చిన్న సుత్తితో పదేపదే అతడి తలపై కొట్టడంతో చనిపోయాడు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఆమె వివరణ ఇస్తూ 'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను. కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాను. తీవ్రంగా కొట్టాను. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం చూస్తున్నాడు. అతడికి ఎంత ధైర్యం. నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె చెప్పింది. అతడి ప్రవర్తన చూసి మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేసినట్లు చెప్పింది. ప్రేమతో మొదలైన వీరి జీవితం చివరిదశలో మాత్రం విషాదంగా మిగిలింది.