మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 జులై 2018 (13:26 IST)

అమ్మో.. చైనా మహిళ మూత్రపిండంలో 3వేల రాళ్లు.. గంటపాటు సర్జరీ చేసి?

కిడ్నీలో రాళ్లొచ్చిన వ్యాధిగ్రస్థుల్లో భారతీయుడిదే ఆల్‌టైమ్ రికార్డు. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను సర్జరీ చేసి విజయవంత

కిడ్నీలో రాళ్లొచ్చిన వ్యాధిగ్రస్థుల్లో భారతీయుడిదే ఆల్‌టైమ్ రికార్డు. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను సర్జరీ చేసి విజయవంతంగా తొలగించారు. అయితే తాజాగా ఓ చైనా మహిళ మూత్రపిండంలో ఒకటి కాదు.. ఏకంగా మూడువేల రాళ్లను వైద్యులు వెలికితీశారు. 
 
వివరాల్లోకి వెళితే... చైనాకు చెందిన జాంగ్ అనే మహిళకు గత కొంతకాలం బ్యాక్ పెయిన్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో జాంగ్.. వుజ్జిన్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించింది. దీంతో ఆమెకు డాక్టర్లు చికిత్స చేశారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. 
 
జాంగ్ కుడి మూత్ర పిండం మొత్తం రాళ్లతో నిండినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఒక గంటపాటు సర్జరీ చేసి.. జాంగ్ మూత్ర పిండంలో నుంచి 3వేల రాళ్లను బయటకు తీశారు డాక్టర్లు. అయితే బాధిత మహిళకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలుసు. వేల సంఖ్యలో రాళ్లు ఉండటాన్ని చూసి జాంగ్ షాక్‌కు గురైంది.