మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 జులై 2018 (13:30 IST)

ఇంటి సోఫాలో సింహం... టెలిపతి పిక్‌తో బయటకు పంపిన ఒరేగాన్ మహిళ

సాధారణంగా అడవి మృగాలైన సింహం, పులి, చిరుత, తోడులు వంటి క్రూరమృగాలు కనిపిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటాం. కానీ, ఆ మహిళ మాత్రం అలా చేయలేదు. తన ఇంట్లోని సోఫాలో దర్జాగా పడుకునివున్న స

సాధారణంగా అడవి మృగాలైన సింహం, పులి, చిరుత, తోడులు వంటి క్రూరమృగాలు కనిపిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటాం. కానీ, ఆ మహిళ మాత్రం అలా చేయలేదు. తన ఇంట్లోని సోఫాలో దర్జాగా పడుకునివున్న సింహాన్ని చూసి బెదరలేదు.. తొణకలేదు. పైగా, ఆ సింహాన్ని బయటకు పంపేందుకు తనకు తెలిసిన టెలిపతిని ఉపయోగించి, విజయం సాధించింది. ఈ ఘటన ఒరేగాన్‌లో జరిగింది.
 
ఒరేగాన్‌కు చెందిన ల్యూరెన్ టేలర్ అనే మహిళ తన వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ పని ముగించుకుని ఇంటికి తిరిగివచ్చే సమయానికి హాలులోని సోఫాలో ఓ సింహం పడుకునివుంది. దీన్ని ఆమె గమనించలేదు. ప్రధాన తలుపు తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లిన ఆమె.. తన పనుల్లో మునిగిపోయింది. ఆ తర్వాత అలకిడి శబ్దం విని అటు చూడగా అక్కడ ఓ సింహం సంచరించడం చూసి ఆమె నిశ్చేష్టురాలైంది. 
 
దీనిపై ఆ మహిళ స్పందిస్తూ, ఇంటి వెనుక తలుపుకు సమీపంలో ఉన్న వాటర్ ఫౌంటైన్‌లో ఆ సింహం నీళ్లు తాగి.. తెరిచివున్న వెనుక తలుపు నుంచి ఇంట్లోకి వచ్చివుంటుందని తెలిపారు. ఇంటి ఆవరణలోనే కాకుండా ఇంట్లో కూడా అనేక మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు చాటున సింహం నడుస్తుంటే తాను తొలుత గమనించలేదన్నారు. 
 
ఇల్లంతా కలియతిరిగిన ఆ సింహం.. చివరకు సోఫా మాటున పడుకుంది. కొద్దిసేపటి తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, చివరకు భయపడిన, ఆందోళన చెందుతూ, మూసివేసిన విండో ద్వారా నిష్క్రమించాలని ప్రయత్నించింది. అలా ఆరు గంటల పాటు ఇంట్లోనే గడిపిన ఆ సింహం చివరకు దాన్ని టెలిపతిని ఉపయోగించి బయటకు పంపించింది. తెరిచిన తలుపులు ద్వారా ఆ టెలిపతిక్ ఫోటోల ద్వారా సింహం బయటకు పంపించింది.