సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (16:05 IST)

బిలియనీర్ ఇంటి లిఫ్టులో చిక్కుకున్న మహిళ.. 3 రోజులు అందులోనే...

అమెరికా దేశంలో ఓ బిలియనీర్ ఇంట్లో ఉన్న లిఫ్టులో ఓ మహిళ చిక్కుకుంది. ఈ విషయాన్ని కోటీశ్వరుడు కుటుంబ సభ్యులుగానీ, పనిమనుషులుగానీ గుర్తించకపోవడంతో ఆ మహిళ ఆ లిఫ్టులోనే మూడు రోజుల పాటు ఉండిపోయింది. చివరకు కొరియర్ డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూయార్క్ నగరానికి చెందిన ఓ కోటీశ్వరుడు ఇంట్లో ఫోర్జాలిజా అనే 53 యేళ్ల మహిళ పని చేస్తుంది. ఆమె ఎప్పటిలాగే గత శుక్రవారం కూడా ఆ ఇంట్లో పని చేసిన తర్వాత లిఫ్ట్‌లో కిందికి దిగడానికి ప్రయత్నించింది. కానీ ఆ లిఫ్టు కొద్దిగా కిందికి వచ్చి మధ్యలోనే ఆగిపోయింది. ఆమె ఎంతగా కేకలు వేసినా ఆమె పిలుపు ఎవరికీ వినిపించలేదు. చివరకు ఆ లిఫ్టులోనే ఆమె మూడు రోజుల పాటు ఉండిపోయింది. 
 
చివరకు సోమవారం ఉదయం ఆ కోటీశ్వరుడు ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ లిఫ్ట్‌ను తెరిచి చూడగా, అందులో ఫోర్జాలిజా ఉండటం చూసి షాక్ తిన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు ఎలాంటి అన్నపానీయాలు లేకపోవడంతో ఆ మహిళ డీహైడ్రేషన్‌కు గురైంది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు.