ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (08:43 IST)

అమెరికా కోర్టులో జడ్జీలుగా భారత సంతతి మహిళలు

భారత సంతతికి చెందిన అర్చనా రావు, దీపా అంబేకర్ అమెరికాలో జడ్జీలుగా నియమితులయ్యారు.

న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్‌ కోర్టు జడ్జిగా దీపా అంబేకర్‌‌లను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియా నియమించారు.
 
అర్చనారావు మొదట సివిల్‌ కోర్టు తాత్కాలిక జడ్జిగా గత జనవరిలో నియమితులై సేవలందించారు. దీపా అంబేకర్‌ 2018 మే నెలలో సివిల్‌ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పని చేశారు.