గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2019 (17:05 IST)

కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో పెళ్లి కూతురు ఎస్కేప్, అవమానంతో ఆత్మహత్య

చెన్నై: వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లి పారాణి ఆరకముందు పెళ్లైన కుమార్తె వేరే వ్యక్తితో లేచిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. అయితే కేజీ నగలతో ప్రియుడితో పరారైన పెళ్లి కుమార్తె మాత్రం బెంగళూరులో స్నేహితుల ఇంటిలో తలదాచుకుందని గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.