సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (15:40 IST)

ఎపుడూ ఏడుపు మొహమేనా? భారత్‌లో ఆనందం మచ్చుకైనా లేదట...

ఎందుకురా.. ఏడుపు మొహం పెట్టుకునివున్నావు అంటూ మన పెద్దలు అంటుంటారు. నిజంగానే భారతీయులంతా విషాదంలోనే జీవిస్తున్నారట. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో 2019 సంవత్సరంలో సంతోషం కరువైపోయిందట. ముఖ్యంగా, గత యేడాదితో పోల్చితే మరింతగా దిగజారిపోయారట. 
 
వరల్డ్ 'హ్యాపీ ఇండెక్స్' పోటీలో భారత్ మరింత దిగజారిపోయింది. గత 2018లో ఈ పట్టికలో భారత్ స్థానం 133లో ఉంటే.. 2019 వచ్చేసరికి భారత్ స్థానం ఒక్కసారిగా ఏడు స్థానాలు పడిపోయింది. దీంతో భారత్ ప్రస్తుతం 140వ ర్యాంకులో ఉంది. 
 
ఈ పట్టికలో ఫిన్‌లాండ్ దేశం మొదటి స్థానాన్ని వరుసగా రెండోసారి దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన అమెరికా హ్యాపీనెస్ దేశంగా 19వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మార్చి 20, 2019న యూఎన్‌కు చెందిన డెవలప్‌మెంట్ సొల్యుషన్స్ నెట్‌వర్క్ రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడించింది.
 
భారత్ కంటే హ్యాపీనెస్ స్థానాల్లో పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా ముందు వరుసలో నిలిచాయి. పాకిస్థాన్ 67వ ర్యాంకులో, బంగ్లాదేశ్ 125వ ర్యాంకులో నిలువగా, చైనా 93వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ దేశాల్లో హ్యాపీనెస్ దేశాలను గుర్తించేందుకు ఇన్‌కమ్, ఫ్రీడమ్, ట్రస్ట్, హెల్తీ‌లైఫ్, సోషల్ సపోర్ట్, జెనరొసిటీ (ఔదార్యం) ఇలా మొత్తం ఆరు కీలక అంశాలను ఆధారంగా చేసుకుని ఈ పోల్ నిర్వహించారు. 
 
అయితే, భారతీయుల్లో ఆనందం లేకపోవడానికి కారణమేంటంటే.. దేశ ప్రజల్లో ఎక్కువగా నెగిటీవ్ ఎమోషన్స్, ఆందోళన, బాధ, కోపం ఎక్కువ స్థాయిలో ఉండటమేనని ఈ నివేదిక పేర్కొంది. ఇకపోతే, హ్యాపీనెస్ కంట్రీల్లో వరుసగా రెండో స్థానంలో డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదార్లాండ్స్ నిలిచాయి.
 
అలాగే, యుద్ధవాతావరణం నెలకొన్న సౌత్ సూడన్‌లో నివసించే ప్రజల్లో చాలామంది సంతోషంగా లేరని తెలిపింది. ప్రపంచ దేశాలపై గాలప్ వరల్డ్ పోల్ అడిగిన ప్రశ్నల ఆధారంగా హ్యాపీనెస్ స్టడీ ర్యాంకులను వెల్లడించారు. జీడీపీ, సోషల్ సెక్యూరిటీ సహా పలు అంశలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకుల జాబితాను రిలీజ్ చేశారు.