గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (15:41 IST)

10,100 అడుగుల పొడవైన న్యూడిల్‌ తయారీ.. (వీడియో)

చైనాకు చెందిన ఓ ఆహార సంస్థ గిన్నిస్ రికార్డ్ సాధించింది. ప్రపంచంలో అత్యంత పొడవైన న్యూడిల్‌ను ఈ సంస్థ తయారు చేసింది. 10,100 అడుగుల పొడవైన ఈ న్యూడిల్‌ను పూర్తిగా చేతితోనే తయారు చేశారు. 66 కిలోగ్రాముల ఈ

చైనాకు చెందిన ఓ ఆహార సంస్థ గిన్నిస్ రికార్డ్ సాధించింది. ప్రపంచంలో అత్యంత పొడవైన న్యూడిల్‌ను ఈ సంస్థ తయారు చేసింది. 10,100 అడుగుల పొడవైన ఈ న్యూడిల్‌ను పూర్తిగా చేతితోనే తయారు చేశారు. 66 కిలోగ్రాముల ఈ న్యూడిల్ తయారీకి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
 
ఈ వీడియోలో న్యూడిల్ తయారీకి 40కిలోల బ్రెడ్ పిండిని ఉపయోగిచారు. 0.6 కిలోల ఉప్పు, 26.8 లీటర్ల నీటిని వాడారు. ఈ న్యూడిల్ తయారీకి 17గంటల సమయం పట్టింది. ఈ న్యూడిల్ ద్వారా 2001లో జపాన్‌లో తయారైన 1800 అడుగుల పొడవైన న్యూడిల్ రికార్డును చైనా కంపెనీ బ్రేక్ చేసింది.
 
ఈ న్యూడిల్‌ పొడ‌వును లెక్క వేయ‌డానికి గిన్నిస్ అధికారి జాన్ గార్లండ్‌కి మూడు గంటల సమయం పట్టింది. ఈ న్యూడిల్‌ను టమోటా, వెల్లుల్లి సాస్‌తో 600 మంది ఉద్యోగుల కుటుంబాలకు అందించారు.