బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (13:43 IST)

కాశ్మీర్ అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ పరిష్కరిస్తారా? నిక్కీ హేల్ హామీ ఇస్తున్నారుగా?

దక్షిణాసియాలోని ఇరుగుపొరుగు దేశాలు భారత్-పాకిస్థాన్ వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణమైన కాశ్మీర్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీన

దక్షిణాసియాలోని ఇరుగుపొరుగు దేశాలు భారత్-పాకిస్థాన్ వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణమైన కాశ్మీర్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీనియర్ భారతీయ అమెరికన్ మహిళ నిక్కీ హెలీ డోనాల్డ్ ట్రంప్ క్యాబినెట్‌లో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి శాంతి నెలకొల్పడంలో తమ అధినేత డొనాల్ట్ ట్రంప్ కీలక పాత్ర పోషించనున్నారని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య శాంతి కోసం తమ నాయకత్వం చొరవ తీసుకుంటుందని నిక్కీ హామీ ఇచ్చారు.  ఏప్రిల్‌లో జరిగే భద్రతా మండలి సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
అయితే పాకిస్థాన్ మాత్రం కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఐరాసలో చెప్పింది. గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో పాక్ రాయబారి మలీసా లోధీ మాట్లాడుతూ, ఐరాస రికార్డుల ప్రకారం కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్, పాక్‌లను కోరుతూ ఐర్లాండ్ 1962లో ఐరాసలో ప్రతిపాదించిన ఒక తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. కాగా, వీటో అధికారంపై పాక్ వైఖరిని లోధీ మరోసారి స్పష్టం చేస్తూ వీటో హక్కుతో, లేదా లేకుండా భద్రతా మండలికి కొత్త శాశ్వత సభ్యులను చేర్చడాన్ని తమ దేశం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.