సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 28 ఏప్రియల్ 2025 (18:11 IST)

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

Charmi, vijay, puri
Charmi, vijay, puri
డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ తో ఇండియన్ సినిమాని మరోసారి షేక్ చేయడానికి సిద్ధంగా వున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టబు కీలక పాత్ర పోషించనుంది.
 
ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచుతూ, శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు. మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, హై-ఆక్టేన్ పెర్ఫార్మెన్స్‌లతో అడగొట్టే విజయ్ కుమార్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తర్వాత చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. 
 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్ లో చూడబోతున్నారు ఆడియన్స్. ఈ ప్రాజెక్ట్ తో  తెలుగు సినిమాకి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తున్న టబు కథలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు, విజయ్ కుమార్ ప్రాజెక్ట్ లోకి రావడంతో ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. 
 
ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది