Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ
అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో తర్వాత మళ్లీ టబు ఎంట్రీ ఇవ్వబోతోంది. పూరి, సేతుపతి సగర్వంగా ఇండియన్ సినిమా యొక్క రత్నాన్ని స్వాగతించారు, నటి టబు తన ఉనికిని డైనమిక్ పాత్రలో పోషించనున్నారు. ఆమె ఎలక్ట్రిక్. ఆమె పేలుడు.ఆమె THE TABU. అంటూ ఛార్మి కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరీ, టబు, చార్మి వున్న ఫొటోను పోస్ట్ చేశారు. విజయ్ సేతుపతి సరసన ఆమె నటించనున్నట్లు వెల్లడించారు.
ఇటీవలే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా చిత్రంలోని డైలాగ్ వర్షన్ ను ముగింపు దశకు చేరుకుందని తెలియజేశారు. నేడు టబు నటించనున్నదని వెల్లడించారు.
ఈ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఇందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ సరికొత్తగా వుండబోతోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్, చార్మి కౌర్ త్రయం ఆనందం, ఉత్సాహం సినిమా పట్ల వారి ఎక్సయిట్మెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాన్-ఇండియా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.