శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 5 ఏప్రియల్ 2025 (18:09 IST)

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

Vijay Sethupathi, Puri Jagannadh, Charmi Kaur
Vijay Sethupathi, Puri Jagannadh, Charmi Kaur
డైరెక్టర్ పూరి జగన్నాధ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. యూనిక్ స్టొరీ, గ్రిప్పింగ్ కథనంతో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం, విజయ్ సేతుపతి చరిస్మాటిక్ ప్రజెన్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది.
 
పూరి జగన్నాధ్, చార్మి కౌర్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని ఘనంగా నిర్మించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా చిత్రంలోని డైలాగ్ వర్షన్ ను ముగింపు దశకు చేరుకుందని తెలియజేశారు.
 
ఈ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఇందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ సరికొత్తగా వుండబోతోంది.  ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్, చార్మి కౌర్ త్రయం ఆనందం, ఉత్సాహం సినిమా పట్ల వారి ఎక్సయిట్మెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. 
 
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాన్-ఇండియా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.