మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (10:34 IST)

యుద్ధానికి సిద్ధం కావాలంటూ సైన్యానికి పిలుపునిచ్చిన చైనా అధ్యక్షుడు

Xi Jinping
చైనా, తైవాన్ దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ సంకేతాలు నెలకొన్నాయి. వీటికి ఆజ్యం పోసేలా యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా సంస్థ కథనాలు ఉటంకించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా 'యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలి. దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలి. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి' అని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.