ఆయన నాకు దేవుడితో సమానం: దేవీశ్రీ ప్రసాద్
17
ఏళ్ళ ప్రాయంలో "దేవి" సినిమా ద్వారా దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆయనకూ చిరంజీవికి చాలా సంబంధం ఉంది. రచయిత సత్యమూర్తి కుమారుడే దేవీశ్రీ ప్రసాద్. చిన్నప్పటి నుంచి సంగీతజ్ఞానం ఎక్కువే. సత్యమూర్తి చిరంజీవి చిత్రాలకు కథలు అందించారు. సినిమాకు పనిచేశాడు. వాళ్ళన్నగారి దగ్గరకు వచ్చిన ఎం.ఎస్. రాజుకు ఓసారి దేవీ చేసిన కొన్ని ట్యూన్స్ వినిపించాడు. అప్పటికి 14ఏళ్ల పిల్లాడులో విషయంఉందని ఆనాడే గ్రహించిన ఎం.ఎస్. రాజు "దేవీ"కి అవకాశం కల్పించాడు. ఆ తర్వాత చిరంజీవికి కూడా కొన్ని ట్యూన్స్ వినిపించడంతో అవి నచ్చి తప్పక అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలా వారి కలయిక కొనసాగింది. ఓ సందర్భంలో చిరంజీవి దేవీశ్రీకి గిఫ్ట్‌గా ఇంపోర్టెడ్ వాచ్ బహుకరించాడు కూడా. దేవీశ్రీ ప్రసాద్ డాన్సర్ కూడా. మొట్టమొదట "మిస్టర్ దేవీ" అనే ప్రైవేట్ ఆల్బమ్ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన వయసు 25. ఈ ఎనిమిదేళ్ల కెరీర్‌లో "ఆనందం", "ఆర్య", "వర్షం", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "మాస్", "మన్మథుడు", "శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్", "బొమ్మరిల్లు"... వంటి చిత్రాలు ఈ యువకుడి ప్రతిభకు సాక్ష్యాలుగా నిలిచాయి. మసాలా రాగాలు దట్టించడంలో సిద్ధహస్తుడయ్యాడు. క్యాచీ స్వరాలు అందించడంలో దిట్టగా ముద్రపడింది. దేవి స్వరకల్పనలో ఇటీవల విడుదలైన "శంకర్‌దాదా జిందాబాద్" డివైడ్ టాక్‌తో నడుస్తున్నా ఆయన అందించిన స్వరాలు ఆదరణ చూరగొంటున్నాయి. ఈ సందర్భంగా దేవీశ్రీ ప్రసాద్‌తో కాసేపు...
ప్రశ్న: "శంకర్‌దాదా జిందాబాద్"కు టీమంతా మారినా మీరొక్కరే ఉన్నారు కారణం?జ: "శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్"కి పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ ఈ చిత్రానికి మారారు. నేను తప్ప. "శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్" మ్యూజికల్ హిట్ కావడంతో "శంకర్‌దాదా జిందాబాద్"పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. నేనెలాంటి సంగీతం ఇస్తానన్న ఆత్రుత శ్రోతల్లో ఉంది. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఔట్‌పుట్ ఇచ్చాను.ప్రశ్న: చిత్రాలకు మాతృకలకు అనుగుణంగా స్వరాలు సమకూర్చారా?జ: రెండు ఒరిజినల్ వెర్షన్లుగా చూశాను. కానీ వాటి ముద్రపడకుండా జాగ్రత్త పడ్డాను. చిరంజీవిగారి డాన్స్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి అనుగుణంగా మ్యూజిక్ కంపోజ్ చేశాను. చిత్రంలో కథానాయికది రేడియో జాకీ పాత్ర. హిందీ వెర్షన్ "గుడ్ మార్నింగ్ ముంబాయ్" అని అంటే... తెలుగులో " గుడ్ మార్నింగ్ హైదరాబాద్" అని అంటుంది. కాకపోతే పాటలో "గుడ్‌మార్నింగ్ హైదరాబాద్" అని డాన్సర్లు విష్ చేసే పద్ధతిని డాన్స్ చేయడానికి వీలుగా కంపోజ్ చేశాను. పాటలన్నీ సందర్భానుసారం వస్తాయి.
ప్రశ్న: అంటే మెగాస్టార్ డాన్స్ సిల్క్స్‌ను మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేశారన్నమాట?జ: అవును ప్రశ్న: మరి ఐటం సాంగ్ (ఆకలేస్తే అన్నం పెడతా...") ఒరిజినల్ వెర్షన్ లేదు కదా?జ: మాతృకలో ఐదుపాటలే ఉన్నాయి. కమర్షియల్ అంశాలు దృష్టిలో పెట్టుకుని, చిరంజీవి సినిమాల్లో సహజంగా కనిపించే ఆరు పాటలూ ఉండాలన్న నియమంతో ఈ పాట జత చేశాం. అయినా ఐటం సాంగ్ కథకు లింక్ చేశాం. ఆ పాట సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రశ్న: ఆడియోరోజు మీరు వేసి స్టెప్స్‌లు ఆ పాటకు సరితూగాయని అంటున్నారు. దీనిపై మీ ఫీలింగ్? జ: ఆడియోరోజు సరదాగా ఏదో స్టెప్ వేయాలని వేసింది. కరెక్ట్ వర్షన్ సినిమాలోదే. ప్రేక్షకులు రిసీవ్‌చేసుకుంటారనుకున్నా...
ప్రశ్న: మమతామోహన్‌దాస్‌తో "రాఖీ" (రాఖీ రాఖీ రాఖీ... నువ్వే నా కవాసాకీ), "జగడం" "శంకర్‌దాదా జిందాబాద్" (ఆకలేస్తే అన్నం పెడతా...) చిత్రాల్లో పాడించారు. ఆమెలోని టాలెంట్‌ను ఎలా గుర్తించారు?జ: నేను ఏ మ్యూజిషియన్నీ పరిచయం చేసినా వారిలో ఉన్న టాలెంట్ కన్నా అంకితభావాన్ని మొదటిగా గుర్తిస్తాను. ఆ లక్షణం మమతలో సమృద్ధిగా ఉంది. ఏదో చేయాలన్నతపన ఉంటే... మీరు ఏది చేసినా చక్కగా ఉంటుంది. అద్భుతమైన, శక్తివంతమైన గాత్రం ఆమెది. నాలాగే గంతులేస్తూ. పెర్‌ఫార్మ్ చేస్తూ పాడుతూ ఉంటుంది. అంటే పాటను ఎంజాయ్ చేస్తూ పాడుతుందన్న మాట. భాష రాకపోయినా ఉచ్ఛారణలో దోషం రాకుండా జాగ్రత్తపడుతూ ఉంటుంది. మమత నటి కూడా కావడంతో భావాన్ని ఈజీగా పలికించ గలుగుతోంది. ప్రశ్న: అద్నాన్ సమీతో "భూగోళమంతా సంచిలోన... పాట పాడించారు. ఆయనతో మీ అనుభవం?జ: "వర్షం" చిత్రంలోని "నైజాం పోరి... పాట ద్వారా ఆయన్నితెలుగు తెరకు పరిచయం చేశాను. "శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్"లో పాడిన పాటను ఆయనింకా గుర్తించుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. "నువ్వు పాడించిన ఆ రెండు పాటలు మర్చిపోలేను". అని ఆ సందర్భంగా అన్నారు. ఒక సంగీతదర్శకుడికి అంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది? ప్రశ్న: ప్రస్తుతం ఏయే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు?జ: బోయపాటి శ్రీను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న చిత్రం, పవన్‌కళ్యాణ్స త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా. "బొమ్మరిల్లు" తమిళ వెర్షన్‌కు, విక్రమ్ తమిళ చిత్రం "కందసామి"కి సంగీతం అందిస్తున్నాను. ప్రశ్న: తమిళరంగాన్ని కూడా ఏలుతున్నారన్న మాట!జ: నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. తమిళ పరిశ్రమ గురించి అవగాహన ఉంది. నేను బాగా ఆనందపడే విషయం ఒకటి చెప్పనా.... తమిళ దర్శకుల్లో చాలామంది నా అభిమానులే. ప్రశ్న: మీ కంపోజింగ్‌పై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? జ: ఇళయరాజాగారు. ఆయన నాకు దేవుడితో సమానం. చెన్నైలోని నా స్టూడియోలో ఆయనది పెద్ద వాల్‌పోస్టర్ ఉంటుంది.