ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (22:28 IST)

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

Bride with milk glass
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ నటించిన దేవర చిత్రంలోని పాట 'చుట్టమల్లె చుట్టేస్తానే' ఏ స్థాయిలో హట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ పాటను సందర్భానుసారంగా చక్కగా వాడేసుకుంటున్నారు. తాజాగా చుట్టమల్లెను శోభనం గదికి కూడా వాడేసారు.
 
కేరళలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శోభనం రోజు పాలగ్లాసుతో వధువును పంపడానికి చుట్టమల్లె పాటతో మిక్స్ చేసారు. నవ వధువు ముసిముసి నవ్వులు నవ్వుతూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెట్టగా... వరుడు గుబురు గెడ్డంతో, కళ్లద్దాలు ధరించి గ్లాసు అందుకున్నాడు. ఇక వెంటనే నవ దంపతులిద్దరికీ బైబై చెప్పేసారు బంధువులు. మీరూ ఓ లుక్కేయండి.