1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
  4. IPL 2018: Lynn 62 helps KKR beat RCB by six wickets

ఐపీఎల్ 2018 : కోహ్లీ సేనకు మరో ఓటమి... కోల్‌కతా గెలుపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలోభాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేనకు మరో ఓటమి ఎదురైంది. పసలేని బౌలింగ్‌.. పేలవ ఫీల్డింగ్‌ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమిని తప్పించుకోలేక పోయింది. ఫ

IPL 2018: Lynn 62 helps KKR beat RCB by six wickets ఐపీఎల్ 2018
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలోభాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేనకు మరో ఓటమి ఎదురైంది. పసలేని బౌలింగ్‌.. పేలవ ఫీల్డింగ్‌ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమిని తప్పించుకోలేక పోయింది. ఫలితంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.
 
ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 68 నాటౌట్‌) కీలక అర్ధ సెంచరీకి తోడు ఊతప్ప (21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) మెరుపులు తోడవడంతో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. 
 
జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 నాటౌట్‌), మెకల్లమ్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. రస్సెల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్‌కతా 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. లిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కింది.  
About Writer
pnr
తర్వాతి కథనం
ద్రోణాచార్యకు రాహుల్ పేరును ఎలా సిఫార్సు చేస్తారు?