సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (16:58 IST)

ఐపీఎల్-11: అదరగొట్టిన ఏబీ డివిలియర్స్.. ఢిల్లీపై బెంగళూరు గెలుపు

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 11వ సీజన్లో క్రిస్ గేల్, వాట్సన్ బాటలో వెటరన్‌ వీరుడు ఏబీ డివిల్లీర్స్‌ విజృంభించాడు. గేల్‌, వాట్సన్‌ మాదిరిగా సెంచరీ కొట్టకపోయినా.. అద్భుత బ్యాటింగ్‌తో బెంగళూరును గెలిపిం

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 11వ సీజన్లో క్రిస్ గేల్, వాట్సన్ బాటలో వెటరన్‌ వీరుడు ఏబీ డివిల్లీర్స్‌ విజృంభించాడు. గేల్‌, వాట్సన్‌ మాదిరిగా సెంచరీ కొట్టకపోయినా.. అద్భుత బ్యాటింగ్‌తో బెంగళూరును గెలిపించాడు. కెప్టెన్‌ విరాట్‌ చేతులెత్తేసినా తనదైన శైలిలో చెలరేగిపోయాడు.

బౌండ్రీలు బాదేస్తూ చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ధాటికి రాయల్‌ చాలెంజర్స్‌ లీగ్‌లో రెండో విజయాన్ని అందుకోగా.. ఢిల్లీ నాలుగో ఓటమిని చవిచూసింది.
 
గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీసేన శనివారం జరిగిన పోరులో ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 174 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 85) రాణించగా, శ్రేయాస్‌ అయ్యర్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. 
 
అనంతరం ''మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్'' డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్‌ కోహ్లీ (26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 30) కాస్త మెరిసినా.. కీలక సమయంలో ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌తో ఆదుకోవడంతో బెంగళూరును విజయం వరించింది.