1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
  4. IPL 2018: Rohit keeps Mumbai Indians breathing

ఐపీఎల్ 2018 : చెన్నైపై ముంబై ప్రతీకారం... 8 వికెట్ల విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంది. దాదాపుగా తొలి మ్యాచ్‌తో సమానంగా నమోదైన స్కోర్లలో రోహిత్‌ సేన మెరుగైన ప్రదర్శనతో మ్యాచ్‌ను చేజ

IPL 2018
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంది. దాదాపుగా తొలి మ్యాచ్‌తో సమానంగా నమోదైన స్కోర్లలో రోహిత్‌ సేన మెరుగైన ప్రదర్శనతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. కెప్టెన్ రోహిత్‌కుతోడు లెవిస్ (43 బంతుల్లో 47, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్స్) దుమ్మురేపడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయభేరీ మోగించింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు సురేశ్ రైనా (47 బంతుల్లో 75 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రాయుడు (35 బంతుల్లో 46, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపడంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. 
 
ఈ గెలుపుతో ముంబై జట్టు ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలువగా, ఐదు మ్యాచ్‌లలో ఓడింది. దీంతో నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇకపోతే, చెన్నై సూపర్ సింగ్స్ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లలో గెలుపొంది, రెండింటిలో ఓడిపోయింది. ఫలితంగా 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా?