భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా?
భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా? ఈ ప్రశ్న సంధించింది ఆస్ట్రేలియా జర్నలిస్టు డెన్నిస్ ఫ్రీడ్‌మన్. ఈ వ్యాఖ్యలు ఇపుడు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఇటీవల ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ కెప్టెన్ పదవికి
భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా? ఈ ప్రశ్న సంధించింది ఆస్ట్రేలియా జర్నలిస్టు డెన్నిస్ ఫ్రీడ్‌మన్. ఈ వ్యాఖ్యలు ఇపుడు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఇటీవల ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన గౌతమ్ గంభీర్ డెన్నిస్ ఓ ఉగ్రవాదితో పోల్చారు.
గత వారంలో గంభీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ జాతీయులను ఇండియాలో కాలు పెట్టనీయకుండా చేయాలని కోరిన నేపథ్యంలో, గంభీర్ వ్యాఖ్యలపై ఫ్రీడ్ మన్ మండిపడ్డాడు. ఆయన మాటలు భారత్, పాక్ మధ్య బంధానికి ప్రమాదకారని వ్యాఖ్యానించాడు.
ఇక గంభీర్‌ను విమర్శించడంపై ఫ్రీడ్‌మన్‌ను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. భారత క్రికెటర్లపై వ్యాఖ్యలు చేయడం ఫ్రీడ్‌మన్‌కు కొత్తేమీ కాదని గుర్తు చేస్తున్నారు. ట్విట్టర్‌లో 'నువ్వు చేస్తున్న పనులు మరింత ప్రమాదకరమని' నిప్పులు చెరుగుతున్నారు.