షోయబ్ అక్తర్ విమర్శలు.. ట్వీట్‌ను డిలీట్ చేశాడు.. ఎందుకు?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందని కామెంట్స్ చేశాడు. కాశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని,
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందని కామెంట్స్ చేశాడు. కాశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని, స్వీయ నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న అమాయక కాశ్మీరీలను పొట్టనపెట్టుకుంటోందని, ఐరాస ఇదంతా చూస్తూ ఊరకుంటుందన్నాడు. దీనిపై గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు షాహిద్ అఫ్రిదిపై మండిపడ్డారు.
తాజాగా జింక వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు బెయిలు రావడాన్ని కాశ్మీర్‌తో ముడిపెట్టి ట్వీట్ చేసిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ యూటర్న్ తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన అక్తర్ ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు.
శనివారం జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడంపై అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. సల్మాన్ బెయిల్‌తో ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాలైన కాశ్మీర్, పాలస్థీనా, యెమన్, ఆఫ్ఘనిస్థాన్ సహా ఇతర ప్రాంతాలకు కూడా స్వాతంత్య్రం లభించిందని వార్తను ఏదో ఏరోజు తాను వింటానని ఆశ వుందని తెలిపాడు.