సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (17:15 IST)

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గౌతం గంభీర్

ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ నుంచి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన గంభీర్‌ ఈ ఏడాది తన సొంత జట్టు దిల్లీ డేర్‌ డెవిల్స

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన గంభీర్‌ ఈ ఏడాది తన సొంత జట్టు దిల్లీ డేర్‌‌డెవిల్స్‌కు నాయకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఢిల్లీ ఇప్పటివరకూ టోర్నీలో 6 మ్యాచ్‌లాడగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. అదీ కూడా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది.
 
సొంత జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్ జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో గంభీర్‌ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు ఢిల్లీ డేర్‌‌డెవిల్స్‌ యజమాన్యం పగ్గాలు అప్పగిస్తున్నట్లు తెలిపింది. జనవరిలో నిర్వహించిన వేలంలో గంభీర్‌ను రూ.2.8 కోట్లకు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 26వ తేదీన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌... కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది.