సంబంధిత వార్తలు
- ఐపీఎల్-2021: బెంగళూరు కెప్టెన్సీ మధ్యలోనే విరాట్ కోహ్లీ అవుటా?
- బెంగుళూరు అట్టర్ ప్లాఫ్ : కోల్‌కతా ఘన విజయం
- విరాట్ కోహ్లీ మరో కఠిన నిర్ణయం - ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలకు గుడ్‌బై!
- ఆ ప్రతిపాదనే కోహ్లీ కొంపముంచిందా? అందుకే గౌరవంగా తప్పుకున్నాడా?
- కోహ్లి సంచలన నిర్ణయం: టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై
ఐపీఎల్-2021.. విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. అర్థ సెంచరీతో..?
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రెండో దశలో అరుదైన ఘనత నమోదైంది. తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. కాగా కోహ్లి సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్ ద్వారా వ్యక్తిగతంగా ఐదు జట్లపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇందులో సీఎస్‌కేపై 939 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ 933 పరుగులు, కేకేఆర్ 735 పరుగులు, ముంబై ఇండియన్స్ 728 పరుగులు, ఆస్ట్రేలియా 718 పరుగులు సాధించాడు.
ఇక మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్), పడిక్కల్(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం.
