సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:27 IST)

సెకనుకు 100 ఎంబిపిఎస్‌ స్పీడ్‌.. సేవల పట్ల సంతృప్తిగా లేకుంటే చార్జీల చెల్లింపు.. ఎయిర్‌టెల్

టెలికాం రంగంలో రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు హడలిపోతున్నాయి. తమ కష్టమర్లను నిలుపుకునేందుకు ఆర్ జియోకు పోటీగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా అతిపెద్ద నెట్‌వర్క్ అయి

టెలికాం రంగంలో రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు హడలిపోతున్నాయి. తమ కష్టమర్లను నిలుపుకునేందుకు ఆర్ జియోకు పోటీగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా అతిపెద్ద నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ మరింత దిగివచ్చింది. 
 
వినియోగదారుల కోసం ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది కూడా. తాజాగా వి-ఫైబర్‌ టెక్నాలజీతో సెకనుకు 100 మెగాబిట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు ఈ సేవలను అందించనున్నట్లు తెలిపింది. 
 
ప్రస్తుత కస్టమర్లు.. తాము ఉన్న ప్లాన్‌లోనే వి- ఫైబర్‌ స్పీడ్‌కు అప్‌గ్రేడ్‌కు కావటం ద్వారా ఈ స్పీడ్‌ను అందుకోవచ్చని తెలిపింది. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు విధించబోవటం లేదని తెలిపింది. నెల రోజుల వ్యవధిలో వినియోగదారులు తాము అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి చెందకపోతే మోడెమ్‌ చార్జీలను పూర్తిగా చెల్లించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. 

వెక్టోరైజేష‌న్‌గా పిలిచే ఈ కొత్త టెక్నాల‌జీ సాయంతో ఇప్పుడున్న మౌలిక వ‌స‌తుల‌తోనే యూజ‌ర్ల‌కు 100 ఎంబీపీఎస్ స్పీడు ఇంట‌ర్నెట్ అందించ‌నుంది ఎయిర్‌టెల్‌. దీనికోసం వెయ్యి రూపాయ‌లు చెల్లించి కొత్త మోడెమ్ తీసుకుంటే చాలు. ఇప్పుడున్న యూజ‌ర్లకు అద‌న‌పు చార్జీలేవీ లేకుండానే ఎక్కువ స్పీడు డేటా అందుబాటులోకి రానుంది. కొత్త యూజ‌ర్ల‌కు మూడు నెల‌ల పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటా ఆఫ‌ర్ కూడా ప్ర‌క‌టించింది. వైఫై నెట్‌వ‌ర్క్‌లో హైస్పీడ్ కార‌ణంగా యూజ‌ర్ల‌కు మ‌రింత లాభం చేకూరుతుంద‌ని ఎయిర్‌టెల్ ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్ అజ‌య్ పూరి తెలిపారు.