గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (20:06 IST)

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. మరో 3 నెలలు పొడగింపు

దేశీయ టెలికాం రంగంలో ధరల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం కంపెనీలు ధరలను తగ్గిస్తున్న విషయం తెల్సిందే. ఈ కోవలో ఏప్రిల్‌ నెలలో ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్

దేశీయ టెలికాం రంగంలో ధరల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం కంపెనీలు ధరలను తగ్గిస్తున్న విషయం తెల్సిందే. ఈ కోవలో ఏప్రిల్‌ నెలలో ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ హాలిడే సర్‌ప్రైజ్ పేరిట సమ్మర్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు తాజాగా తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా నెలకు 10 జీబీ చొప్పున మూడు నెలలు 30 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగించింది. దీంతో పాటు.. ఇంటర్నేషనల్ రోమింగ్ కాల్స్‌లో కూడా రాయితీ ఇచ్చింది. 
 
ఇందుకోసం జూలై 1 తర్వాత ‘మై ఎయిర్‌టెల్’ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని వివరించారు. అయితే ఈసారి ఎంత డేటాను ఉచితంగా ఇస్తున్నదీ పేర్కొనలేదు. అయితే, ఈ ఆఫర్‌ను మరో మూడు నెలలు పొడగించడం సంతోషంగా ఉందని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు.