ఉద్యోగి తొలగింపులో అడ్డంగా దొరికిపోయిన టెక్ మహేంద్రా.. సారీ చెబితే ఏంటి.. పరువు పోయె

ఒక ఉద్యోగిని అర్థంతరంగా కంపెనీ నుంచి తొలగిస్తున్న సమయంలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ప్రదర్శించిన దురుసుతనం బట్టబయలు కావడంతో ఆ కంపెనీ చైర్మన్, సీఈఓ బహిరంగంగా ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తొలిగిస్తున్న ఉద్యోగితో హెచ్ఆర్ శాఖ జరిపిన సంభాషణ

mahindra jeeto
హైదరాబాద్| Raju| Last Modified శనివారం, 8 జులై 2017 (09:27 IST)
ఒక ఉద్యోగిని అర్థంతరంగా కంపెనీ నుంచి తొలగిస్తున్న సమయంలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ప్రదర్శించిన దురుసుతనం బట్టబయలు కావడంతో ఆ కంపెనీ చైర్మన్, సీఈఓ బహిరంగంగా ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తొలిగిస్తున్న ఉద్యోగితో హెచ్ఆర్ శాఖ జరిపిన సంభాషణ తీవ్ర అభ్యంతరకరంగానూ, జుగుప్సాయుతంగాను ఉండటంతో అది వైరల్ అయిన వెంటనే సంచలనం కలిగించింది. ఉద్యోగులతో వ్యవహరించాల్సిన నైతిక నియమావళినే వారి సంభాషణ అతిక్రమించినట్లు స్పష్టం కావడంతో అంత పెద్ద కంపెనీ ఉన్నతాధిపతులు కూడా క్షమాపణతో కాళ్లబేరానికి వచ్చారు. 
 
మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానిలు ట్వీటర్‌ వేదికగా ఉద్యోగులకు క్షమాపణలు తెలిపారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఓ ఉద్యోగిని కంపెనీ నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఇందుకు సంబంధించి సదరు ఉద్యోగి కంపెనీ హెచ్‌ఆర్‌ వారితో జరిపిన సంభాషణలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
 
తొలగింపునకు గురైన ఉద్యోగితో హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏకంగా కంపెనీ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా.. సదరు ఉద్యోగికి క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగిని ఇలాంటి ఇబ్బందికి గురి కానివ్వమని హామీ ఇచ్చారు.
 
ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేసిన కొద్ది సేపటి తర్వాత స్పందించిన సీఈవో సీపీ గుర్నాని.. ఉద్యోగితో హెచ్‌ఆర్‌ ప్రవర్తించిన తీరుకు తాను చాలా బాధపడుతున్నట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్ధితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 
 
కంపెనీ పరువు పోయింది కాబట్టి చైర్మన్, సీఈవో తదితరులంతా క్షమాపణలు చెప్పారు కానీ దేశంలో ప్రతి కంపెనీ బతుకూ ఇదే. దీనికేమాత్రం మినహాయింపు కూడా లేదు. ఉద్యోగులను తొలగించే సందర్భంగా భారతీయ చోటా మోటా కంపెనీలు అనుసరిస్తున్న పరమ మొరటు వైఖరి ప్రపంచంలో ఏ దేశంలోనూ కనిపించదనే చెప్పాలి. టెక్ మహేంద్రా కంపెనీ వరకూ వస్తే దొంగలు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి కక్కలేక మింగలేక చివరకు క్షమాపణలతో సరిపెట్టుకున్నారు. కానీ ఏ కంపెనీ కూడా తన ఉద్యోగుల తొలగింపు సమయంలో కనీస నైతిక ప్రమాణాలు పాటించలేదన్నదే వాస్తవం.  
 
పనితీరు, ప్రతిభ, సమర్థత వంటి గుణాల్లో వెనుకబడినప్పుడే కాదు అతి చిన్న కారణాలవల్ల కూడా అహంభావం పెరిగిపోయినప్పడు కూడా ఉద్యోగులను ఉన్నపళానా కత్తెర వేయడం అందరికీ అనుభవైక విషయమే కదా.
 
 
 ✔ @anandmahindra
I want to add my personal apology. Our core value is to preserve the dignity of the individual & we'll ensure this does not happen in future httpstwitter.comc_p_gurnanistatus883275712886480896 …
 
 
 CP ✔ @C_P_Gurnani
I deeply regret the way the HR rep & employee discussion was done. We have taken the right steps to ensure it doesn’t repeat in the future.
 దీనిపై మరింత చదవండి :