గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr

రూ.7777కే ఐఫోన్ 7... ఎయిర్‌టెల్ ఆఫర్

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. మొబైల్ మార్కెట్‌లోకి అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. ఇలాంటి కంపెనీల్లో యాపిల్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తాజా మోడల్ ఐఫోన్ 7 ను

iphone x
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. మొబైల్ మార్కెట్‌లోకి అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. ఇలాంటి కంపెనీల్లో యాపిల్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తాజా మోడల్ ఐఫోన్ 7 నుంచి రూ.7777 డౌన్‌పేమెంట్‌తో అందుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2499 చొప్పున 24 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ అందిస్తోంది. 
 
కాగా దీంతోపాటు ఓ పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను ఉచితంగా ఎయిర్‌టెల్ అందివ్వనుంది. దానికి అందించే ప్లాన్‌లో నెలకు 30 జీబీ ఉచిత 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. వీటితోపాటు ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా యూజర్లకు లభిస్తున్నది. ఇదే ఐఫోన్‌కు చెందిన 128 జీబీ వేరియెంట్‌కు రూ.16,300 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. 
 
ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ మోడల్‌కు అయితే రూ.17,300, ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ వేరియెంట్ అయితే రూ.26 వేల డౌన్‌పేమెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎయిర్‌టైల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ల‌ను యూజ‌ర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.