మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (13:36 IST)

8జీబీ ర్యామ్‌లో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.. వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా..

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌ను స్మార్ట్‌ఫోన్లు ముంచెత్తున్నాయి. ఈ ఫోన్లలో అమర్చే ర్యామ్ సామర్థ్యం 2జీబీ, 3జీబీ, మహా అయితే 6జీబీ. అంతకంటే ఎక్కువ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇంతవరకూ మార్కెట్లో అందుబాటులోక

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌ను స్మార్ట్‌ఫోన్లు ముంచెత్తున్నాయి. ఈ ఫోన్లలో అమర్చే ర్యామ్ సామర్థ్యం 2జీబీ, 3జీబీ, మహా అయితే 6జీబీ. అంతకంటే ఎక్కువ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇంతవరకూ మార్కెట్లో అందుబాటులోకి రాలేదు. 
 
కానీ మొట్టమొదటిసారి తైవాన్ కంపెనీ అసస్ కంపెనీ 8జీబీ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. జెన్‌ఫోన్ మోడల్స్ మార్కెట్లో విరివిగా ఆదరణ పొందడంతో ఈ కంపెనీ స్పీడ్ పెంచింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు 8జీబీ ర్యామ్‌తో మొట్టమొదటి సారి జెన్‌ఫోన్ ఏఆర్ అనే ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 
 
ఫోన్ ఓవర్‌హీట్ కాకుండా కాపాడగలిగే వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే ఈ స్మార్టో ఫోన్‌లో అమర్చిన కెమెరా సామర్థ్యం కూడా ఎక్కువే. 23 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్‌ను రూపొందించారు.