రిలయన్స్ జియో మరో ఉచిత ఆఫర్... పైసా చెల్లించకుండా...

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో టెలికాం కంపెనీ తన మొబైల్ వినియోగదారులకు మరో ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. పైసా ఖర్చు లేకుండానే కాలర్ ట్యూన్స్ పెట్టుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

reliance jio
pnr| Last Updated: గురువారం, 6 ఏప్రియల్ 2017 (16:12 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో టెలికాం కంపెనీ తన మొబైల్ వినియోగదారులకు మరో ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. పైసా ఖర్చు లేకుండానే కాలర్ ట్యూన్స్ పెట్టుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

దేశీయంగా ఈ కంపెనీ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీతో పాటు.. ధరలు, ఆఫర్ల యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వివిధ రకాల ఆఫర్లతో రిలయన్స్ జియో ఇతర టెలికాం కంపెనీలను బెంబేలెత్తిస్తోంది.

తాజాగా మరో ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండానే కాలర్ ట్యూన్స్‌ను పొందే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది. జియో ట్యూన్ సర్వీస్ ద్వారా కాలర్ ట్యూన్స్‌ను సెట్ చేసుకోవచ్చని జియో తెలిపింది.

జియో మ్యూజిక్ యాప్‌లో ఈ ఆప్షన్ ఉంటుందని వెల్లడించింది. వాస్తవానికైతే ఈ కాలర్ ట్యూన్స్‌కు నెలవారీ ఛార్జీలను టెలికాం సంస్థలు వసూలు చేస్తున్నాయి. కానీ, జియో ఈ కాలర్ ట్యూన్స్‌ను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.దీనిపై మరింత చదవండి :