1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (14:45 IST)

మనిషి మెదడులోని ఆలోచనలు 'ఫేస్‌బుక్' పసిగట్టేస్తుంది.. ఎలా?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సంచలనం సృష్టించనుంది. సామాజిక మాద్యమంలో ఇప్పటికే అనేక నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉన్న ఫేస్‌బుక్.. తాజాగా మరో లేటెస్ట్ ఇన్నోవేషన్‌కు సిద్ధమైంది. నిజంగా అనుకున్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సంచలనం సృష్టించనుంది. సామాజిక మాద్యమంలో ఇప్పటికే అనేక నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉన్న ఫేస్‌బుక్.. తాజాగా మరో లేటెస్ట్ ఇన్నోవేషన్‌కు సిద్ధమైంది. నిజంగా అనుకున్నట్టుగా ఇది కార్యరూపం దాల్చితే మాత్రం ఫేస్‌బుక్ సరికొత్త సంచలనం సృష్టించినట్టే... 
 
ఇంతకీ ఆ ఆవిష్కరణ ఏంటనేదే కదా మీ సందేహం. "వ్యక్తి ఆలోచనను పసిగట్టే పరికరం. మనిషి మెదడులోని ఆలోచనలను, భావాలను చదవగలిగే 'మైండ్ రీడింగ్' పరికరాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో జరిగే ఫేస్‌బుక్ వార్షిక సదస్సులో ఈ పరికరాన్ని ఆవిష్కరించనున్నట్టు సమాచారం. 
 
నిజానికి గత యేడాది "బిల్డింగ్ 8" పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. ఇందులోభాగంగానే మనిషి ఆలోచనలు పసిగట్టే పరికరాన్ని తయారు చేసే పనిలో బిజీగా ఉంది. అంతేకాదు వచ్చే నెలలోనే దానిని ఆవిష్కరించేందుకు ముమ్ముర ఏర్పాట్లు చేస్తోంది. అంతా ఓకేగానీ ఆ పరికరం పేరు "బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్" అని పేరు పెట్టింది.