ఐడియా బెస్ట్ ఆఫర్... రూ.14కే అపరిమిత ఇంటర్నెట్!

ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఐడియా తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.14కే ఓ గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఇటీవల వొడాఫోన్ 16 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు

mobile phone
pnr| Last Updated: ఆదివారం, 22 జనవరి 2017 (09:16 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఐడియా తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.14కే ఓ గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఇటీవల వొడాఫోన్ 16 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అపరిమిత ఇంటర్నెట్‌ను గంట పాటు వినియోగించుకోవచ్చని తెలిపిన విషయంతెల్సిందే. ఈ ప్లాన్ కంటే రెండు రూపాయలు తక్కువగా ఐడియా అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ఈనెల 19వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది.

నిజానికి దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. జియో దెబ్బకు టెలికాం కంపెనీలన్నీ వివిధ రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అపరిమిత కాల్స్‌ ఊసే లేని కాలంలో జియో ప్రభావంతో దేశంలోని ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌లన్నీ ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అంటూ సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. అందులోభాగంగానే ఐడియా కూడా రూ.14 ప్యాక్‌ను ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :