1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:52 IST)

వాటర్‌ అండ్‌ డస్ట్‌ ఫ్రూఫ్.. జియోని నుంచి పీ7 మాక్స్ రిలీజ్..

జియోని మొబైల్ పీ సిరీస్ నుంచి తాజాగా పీ7 మాక్స్ విడుదలైంది. ఇందులో వోల్టీ పరిజ్ఞానంతో రాబోతున్న దీని ధర రూ.13,999. ఈ ఫోనులో 3జీబీ ర్యామ్, ప్రొసెసర్ భారీ ఉండటంతో మల్టీ టాస్కింగ్‌కి, 3డీ గేమింగ్ వంటి సద

జియోని మొబైల్ పీ సిరీస్ నుంచి తాజాగా పీ7 మాక్స్ విడుదలైంది. ఇందులో వోల్టీ పరిజ్ఞానంతో రాబోతున్న దీని ధర రూ.13,999. ఈ ఫోనులో 3జీబీ ర్యామ్, ప్రొసెసర్ భారీ ఉండటంతో మల్టీ టాస్కింగ్‌కి, 3డీ గేమింగ్ వంటి సదుపాయాలుంటాయి. 
 
ఓఎస్‌ - ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లౌ 6.0.. మార్ష్‌మల్లౌ లేటెస్ట్‌ వర్షన్‌ వల్ల యూజర్‌కు మరిన్ని కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ముందు 5ఎంపీ, వెనక 13 మెగాపిక్స్‌ల్స్‌ కెమెరాను కలిగి వుంటుంది. 5.50 అంగుళాల స్క్రీన్.. 720-1080 రిసిల్యూషన్‌.. 3100 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ వుంటుంది. 
 
3జీ, 4జీ - రెండు సిమ్ముల సౌకర్యం ఉందని.. జియో సిమ్‌ పనిచేసే వోల్టీ పరిజ్ఞానం రెండు సిమ్స్‌కు ఉంది. వాటర్‌ అండ్‌ డస్ట్‌ ఫ్రూఫ్‌, 20 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌ చేసే సదుపాయం ఉంటుంది.