శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (08:35 IST)

వామ్మో... సుందర్ పిచాయ్ వేతనం అక్షరాలా రూ.1,300 కోట్లపైనే...

సుందర్ పిచాయ్.. టెక్ సెర్చ్ దిగ్గజం గూగుల్ సీఈవో. చెన్నై నగరానికి చెందిన ఆయన.... గత 2015లో ఈ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు. ఆ యేడాది అంతంతమాత్రంగానే ఆయన వేతనాన్ని అందుకున్నారు.

సుందర్ పిచాయ్.. టెక్ సెర్చ్ దిగ్గజం గూగుల్ సీఈవో. చెన్నై నగరానికి చెందిన ఆయన.... గత 2015లో ఈ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు. ఆ యేడాది అంతంతమాత్రంగానే ఆయన వేతనాన్ని అందుకున్నారు. కానీ, 2016 సంవత్సరానికి వచ్చేసరికి ఇది ఏకంగా రెట్టింపు అయింది. ఫలితంగా 2016 సంవత్సరానికి గాను సుందర్ అందుకున్న వేతనం అక్షరాలా రూ.1300 కోట్లు(200 మిలియన్ డాలర్లను పిచాయ్‌కి వేతన ప్యాకేజీ కింద చెల్లించింది). 
 
2015 సంవత్సరంలో సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో గూగుల్‌ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. మెషిన్‌ లెర్నింగ్‌, హార్డ్‌వేర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో గూగుల్‌ పెట్టుబడులు పెట్టింది. గత ఏడాది కొత్త స్మార్ట్‌ఫోన్లు, వర్చువల్‌ రియాలిటీ(విఆర్‌) హెడ్‌సెట్‌ సహా పలు వినూత్న పరికరాలను ఆవిష్కరించింది. ఫలితంగా ఆయన పనితీరుకు మెచ్చి ఈ మొత్తాన్ని గూగుల్ సంస్థ కేటాయించింది.