ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Ashok
Last Modified: గురువారం, 27 ఏప్రియల్ 2017 (15:48 IST)

మున్ముందు సృజనాత్మకత కూడా యాంత్రికం కానున్నదా? గూగుల్ తెస్తుంది త్వరలో...

ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ అనువాద ఉత్పత్తిలో భారతీయ భాషల్లో కూడా న్యూరల్ మెషీన్ టెక్నాలజీ అనువాదాల సాంకేతికతను జోడించినట్లు ప్రకటించింది. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో గూగుల్ సంస్థ ఇప్పుడు భారతీయ భాషల అనువాదంలో కూడా అతిపెద్ద ముందడుగు వేసిన

ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ అనువాద ఉత్పత్తిలో భారతీయ భాషల్లో కూడా న్యూరల్ మెషీన్ టెక్నాలజీ అనువాదాల సాంకేతికతను జోడించినట్లు ప్రకటించింది. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో గూగుల్ సంస్థ ఇప్పుడు భారతీయ భాషల అనువాదంలో కూడా అతిపెద్ద ముందడుగు వేసినట్లుగా ప్రకటించింది. తమ న్యూరల్ మెషీన్ ట్రాన్లేషన్ (NMT) అంటే నాడీ సంబంధ యాంత్రిక అనువాదం అనే సాంకేతికతను ఈ తొమ్మిది భారతీయ భాషలకు కూడా జోడిస్తున్నట్లుగా తెలియజేసింది.
 
హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు, గుజరాతీ, పంజాబీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ సాంకేతికతను చొప్పించనున్నది. ఈ కొత్త రకమైన అనువాదాల వ్యవస్థ గూగుల్ క్రోమ్‌లో వినియోగదారులకు అందించే యాంత్రిక అనువాద సామర్థ్యాన్ని కూడా శక్తివంతం చేస్తుంది. అంతేకాదు... గూగుల్ మ్యాప్స్ ప్రోడక్ట్‌లో కనిపించే సమీక్షల సారాంశాలను మరింత మెరుగైన రీతిలో అందిస్తుంది.
 
ఎప్పుడైనా కానీ, యంత్ర అభ్యాసం మరియు కృత్రిమ విజ్ఞానం విషయాల్లో గూగుల్‌కు పోటీయే లేదని మరోసారి నిరూపిస్తోంది. వారు వివిధ రకాల రంగాల్లో సాధించే విజయాల మాదిరిగానే, భాషాపరమైన విషయానికి వస్తే వివిధ భాషల వారిని ఒకటిగా చేయడంలో ఇది ఒక మైలురాయి లాంటి విజయం. వెబ్‌లో భారతీయ భాషలకు ఈ NMT ఏ విధంగా ఉపకరిస్తుంది మరియు ఈ రకమైన కొత్త అనువాద విధానం ఎందుకు గొప్ప విజయమో క్రింద తెలుసుకోండి.
 
న్యూరల్ మెషీన్ ట్రాన్లేషన్ అంటే ఏమిటి?
ఒక్క ముక్కలో చెప్పాలంటే, గూగుల్ యొక్క న్యూరల్ మెషీన్ ట్రాన్లేషన్ అనువాదాలను అందించే ముందు న్యూరల్ నెట్‌వర్క్‌‍లలోని సమాచారాన్ని నిశితంగా అధ్యయనం చేస్తుంది. ఇది బహుభాషా నమూనా, ఒకే సమయంలో సిస్టమ్ ఒకటి కంటే ఎక్కువ భాషల్లో అనువాదం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
 
గూగుల్ ఈ ప్రాజెక్ట్‌కు 2015లో శ్రీకారం చుట్టింది, తమ స్వంత TensorFlow యంత్ర అభ్యాస లైబ్రరీ ఉపయోగించి కంప్యూటర్‌ల ద్వారా చేయబడే అనువాదాలను ఏ విధంగా మెరుగుపరచాలో తెలుసుకోవడానికి పరిశోధనలు మొదలుపెట్టింది. ఇంకా, ఈ సాంకేతికత గురించి గూగుల్ సంస్థలో పరిశోధన శాఖ ఇంజినీర్‌గా పని చేస్తున్న మెల్విన్ జాన్సన్ మీడియాకు ఈ విధంగా తెలియజేసారు, న్యూరల్ నెట్‌వర్క్ అనేది మానవ మెదడు ఆధారంగా రూపొందించినది. బయటి విషయాలకు మనిషి మెదడు ప్రతిస్పందించే లాగానే, ఈ నిశిత అధ్యయన న్యూరల్ నెట్‌వర్క్‌లు నిర్దిష్ట రకమైన సమాచారానికి ఎలా ప్రతిస్పందించాలో తెలుసుకుంటాయి.
 
ఈ క్రమంలో న్యూరల్ మెషీన్ ట్రాన్లేషన్ (NMT) నెట్‌వర్క్‌ల విషయానికి వస్తే, సిస్టమ్ అనేక భాషల్లో వాక్యాలను అనువాదాల కోసం స్వీకరిస్తుంటుంది. ఉదాహరణకు, హిందీ నుండి ఆంగ్ల అనువాదం కోసం, సిస్టమ్ ఆ వాక్యాలను హిందీలోనూ మరియు అదే విధంగా ఆంగ్లంలోనూ నేర్చుకొని అనువాదాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ సిస్టమ్ ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్‌లు చిత్రాలను గుర్తించగలిగేలా గూగుల్ ఏ విధంగా నేర్పుతుందో అదే రకమైన సాంకేతికతను ఇక్కడ తీసుకొస్తోంది. చిత్రాలను గుర్తుపెట్టే సాంకేతికత సాధించడానికి, ఒక నిర్దిష్ట వస్తువు యొక్క లక్షలాది చిత్రాలు నెట్‌వర్క్‌లో అందుకోబడ్డాయి.
 
ఈ కొత్త వ్యవస్థ మరింత వేగవంతంగా వాక్యాలను అనువాదం చేస్తుంది. ఇది ఎంత గొప్ప విజయమైనప్పటికీ, దీని పరిశోధనలుగా పని చేస్తున్న జాన్సన్ ఈ విధంగా కూడా చెప్పారు... అప్పుడప్పుడు వెబ్‌లో సమాంతర ప్రాంతీయ భాషా కంటెంట్‌ను కనుగొనడం చాలా క్లిష్టమైన విషయం. ఆంగ్ల భాషలోని కంటెంట్ వెబ్‌లో మిగత వాటిని డామినేట్ చేసే స్థాయిలో ఉందనే విషయం మనం ఒప్పుకోవాలి. ఈ కారణంగానే యంత్రాలకు అనువాదం చేయగలిగేలా శిక్షణనివ్వడం కష్టంతో కూడుకున్న పని. ఈ సిస్టమ్ పని చేసే విధానాన్ని మెరుగుపరచడానికి గూగూల్‌కి మరింత డేటా, మరింత కంటెంట్ ప్రాంతీయ భాషల్లో లభించాల్సి ఉంటుందని తెలియజేసారు.
 
మనుషులు ఒకరికొకరు సులభంగా బోధపరచగలిగే మరియు అర్థం చేసుకోగలిగే రీతిలో చెప్పగలగవచ్చు, కానీ ఈ విషయాలు యంత్రానికి నేర్పించడమనేది కొంచెం శ్రమతో కూడుకున్న పని. కనుక, అనువాదాల్లో సూక్ష్మంగా అర్థచ్ఛాయాభేదం ఉండొచ్చు. ఏదేమైనా, ఈ యంత్ర అభ్యాస రంగంలో ఇది ఒక అద్వితీయమైన ముందడుగు, ఎందుకంటే సిస్టమ్ దానికదే స్వంతంగా ఏ విధంగా అనువాదం చేయాలో తెలుసుకుంటుంది. ఇది మున్ముందు భవిష్యత్తులో అనేక రకాల అద్భుత విజయాలకు తెర తీయనుంది.