శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (13:26 IST)

గూగుల్‌లో ఇకపై సెక్స్ నిర్ధారణకు సంబంధించిన సమాచారం ఉండదు.. ఆటో బ్లాక్ చేసేశారు..

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్లు గూగుల్‌లో ఓ పదానికైనా అర్థం దొరుకుతుంది. అయితే ఇకపై సెక్స్ నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌తో పాటు యాహూ, మైక్రోసాఫ్ట్ సంస్థలు బ్లాక్ చేయనున్నాయి. భార‌త్‌లో నిషేధించ‌బ‌

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్లు గూగుల్‌లో ఓ పదానికైనా అర్థం దొరుకుతుంది. అయితే ఇకపై సెక్స్ నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌తో పాటు యాహూ, మైక్రోసాఫ్ట్ సంస్థలు బ్లాక్ చేయనున్నాయి. భార‌త్‌లో నిషేధించ‌బ‌డిన కొన్ని సెక్స్ నిర్ధార‌ణ‌ ప్ర‌క‌ట‌న‌లు ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే కావడంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ డాక్ట‌ర్ సాబూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీంతో విచార‌ణ‌కు స్వీక‌రించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం కేంద్రాన్ని వివ‌ర‌ణ కోరింది. దీంతో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూ సెర్చ్ ఇంజిన్ల అధినేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో ఇందుకు అంగీకారం లభించడంతో ఆటో బ్లాక్‌ను ప్రవేశపెట్టడం జరిగిపోయింది.
 
దీంతో ఆటో బ్లాక్ అనే వ్య‌వ‌స్థ ద్వారా సెక్స్ నిర్ధార‌ణ‌కు సంబంధించిన ఎలాంటి స‌మాచారం ఇక‌పై ఈ సెర్చ్ ఇంజిన్ల‌లో ల‌భించ‌దు. సెక్స్ నిర్ధార‌ణ‌పై స‌మాచారం పొందేందుకు ఎక్కువ‌గా వినియోగించే 22 కీవ‌ర్డ్స్‌ను గుర్తించిన ఈ సంస్థ‌లు… ఆ కీవ‌ర్డ్స్‌తో సెర్చ్ చేస్తే ఆన్‌లైన్‌లో ఇన్ప‌ర్మేష‌న్‌ను బ్లాక్ చేస్తాయ‌ని సుప్రీం కోర్టుకు విన్నవించాయి. ఈ కీవ‌ర్డ్స్ లేదా కీల‌క ప‌దాల‌ను పిటిష‌న‌ర్ డాక్ట‌ర్ జార్జ్ సాబూ గుర్తించి ఆయ సెర్చ్ఇంజిన్ సైట్ల‌కు సూచించారు.