శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (21:46 IST)

భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 2న Infinix Zero 30 5G

Infinix Zero 30 5G
Infinix Zero 30 5G
భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 2న ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ శనివారం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లు అందుబాటులో ఉన్నాయి. డెలివరీలు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
 
ఇన్ఫినిక్స్ జీరో 20కి సక్సెసర్‌గా కొత్త ఇన్ఫినిక్స్ 5జీ  ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 SoCతో పాటు 12GBవరకు RAMతో రన్ అవుతుంది.  
 
ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 108MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 
 
ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ బేస్ (8GB RAM + 128GB స్టోరేజ్) మోడల్ ధర రూ. 23,999కు కొనుగోలు చేయొచ్చు. స్టోరేజీతో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 24,999కు అందుబాటులో ఉంది. లేటెస్ట్ 5G హ్యాండ్‌సెట్ గోల్డెన్ అవర్, రోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది.