బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (11:44 IST)

తక్కువ ధరకే బుక్ చేసుకునేలా సరికొత్త ఫీచర్ గూగుల్ ఫ్లైట్స్

ఫ్లైట్ టికెట్‌ను తక్కువ ధరకే బుక్ చేసుకునేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ పేరు గూగుల్ ఫ్లైట్స్. తక్కువ ఖర్చుతో విమానయానం చేసే అవకాశం కల్పించే దిశగా ఈ గూగుల్ సరికొత్త ఫీచర్‌ పనిచేస్తుంది.
 
వెళ్లాల్సిన ప్రదేశానికి ఏ సమయంలో టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయనే వివరాలతో పాటు బుకింగ్ విషయంలో సలహాలు, సూచనలు చేసేలా ఈ ఫీచర్ వుంటుంది. 
 
ప్రయాణం చేయాలని అనుకుంటున్న మార్గంలో ఏయే సమయాల్లో ధరలు తక్కువగా ఉంటాయనేది గూగుల్ ఫ్లైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలలో టికెట్ ధరలు తగ్గినపుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుందని గూగుల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.