బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (17:29 IST)

ఫేస్‌బుక్ నుంచి కొత్త ఫీచర్.. ఇన్‌స్టా నుంచి ఎఫ్‌బీకి అలా మెసేజ్‌లు పంపొచ్చు..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా భారతదేశంలోని కస్టమర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌(డీఎం)లను మెస్సెంజర్ యాప్‌లో విలీనం చేస్తున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్‌ నుంచి బయటకు రాకుండానే ఫేస్‌బుక్ మెస్సెంజర్‌లోని కాంటాక్ట్‌లకు మెస్సేజ్‌లు పంపించవచ్చు.
 
మెస్సెంజర్ నుంచి కూడా ఇన్‌స్టా యూజర్లకు మెస్సేజ్‌లు పంపవచ్చు. ఈ అప్‌డేట్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో పనిచేస్తాయి. క్రాస్-మెసేజింగ్ ఫీచర్ను ఉపయోగించడానికి కస్టమర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెస్సెంజర్ యాప్‌లను అప్‌డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ (వెర్షన్ 164.0.0.46.123), iOS యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ (వెర్షన్ 165.0) నుంచి యాప్‌లను అప్‌డేట్ చేయాలి. 
 
క్రాస్ మెస్సేజింగ్‌తో పాటు మరిన్ని అప్‌డేట్లను ఫేస్‌బుక్ ప్రకటించింది. డైరెక్ట్ మెస్సేజ్‌లో చాట్‌బాక్స్ రంగును మార్చడం, కొత్త ఎమోజీలు, సెల్ఫీ స్టిక్కర్‌లను సృష్టించడం వంటి మరిన్ని కొత్త ఫీచర్లు అప్‌డేట్లతో పాటు రానున్నాయి. వినియోగదారులు ప్రొఫైల్‌ను సింక్ చేసే ఆప్షన్‌ను ఎంచుకుంటే... ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిస్‌ప్లే పిక్చర్‌, పేరును మెస్సెంజర్ తీసుకుంటుంది.
 
కానీ రెండు ప్లాట్‌ఫాంలలో వినియోగదారుల యూజర్‌నేమ్ ఒకేలా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెస్సెంజర్‌లో చాట్ చేయడానికి యూజర్లు కాంటాక్ట్‌లను సెర్చ్ చేయాలి. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ప్రాంప్ట్ ఈ సేవలను ఎలా పొందవచ్చో చూపిస్తుంది.