మార్చి 1 నుంచి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్.. సర్‌ప్రైజింగ్ ఆఫర్లివే...

మార్చి ఒకటో తేదీ నుంచి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ అమల్లోకి రానుంది. మార్చి 31వ తేదీ లోపు రూ.99 చెల్లించి ఈ సభ్యత్వాన్ని ప్రతి జియో నంబర్ వినియోగదారుడు పొందాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం పొందినవారికి ఏప్రిల్

JioFi
pnr| Last Updated: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (17:30 IST)
మార్చి ఒకటో తేదీ నుంచి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ అమల్లోకి రానుంది. మార్చి 31వ తేదీ లోపు రూ.99 చెల్లించి ఈ సభ్యత్వాన్ని ప్రతి జియో నంబర్ వినియోగదారుడు పొందాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం పొందినవారికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒక యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు ఫ్రీ వాయిస్‌కాల్స్ సదుపాయం పొందుతారు. 2018 మార్చి వరకు జియో ప్రైమ్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

వీటితో పాటు మరికొన్ని నెలవారీ ప్లాన్స్ కూడా జియో తన వినియోగదారులకు కోసం అందుబాటులోకి తీసుకురానుంది. నెలవారీ గడువుతో రూ.149, 499 ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది.

రూ.149 రీచార్జ్‌పై రోజుకు 2 జీబీ 4జీ డేటాను, అలాగే రూ.499 రీచార్జ్‌పై 60 జీబీ డేటాను నెలరోజుల గడువుతో అందించేలా ప్లాన్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్స్ మార్చి నెలాఖరు లోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.దీనిపై మరింత చదవండి :